Daakko Daakko Meka Lyrics Song In Telugu
Post Views:
5
Singer | Sivam |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandra Bose |
తందానే తనేననేనా నే… తందానే తానెనానేనానే
తానానే తన్నిననినానే తానానే తన్నిననినానే
వెలుతురు తింటది ఆకు… వెలుతురు తింటది ఆకూ
ఆకును తింటది మేక… ఆకును తింటది మేక
మేకను తింటది పులి… మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి… ఇది కదరా ఆకలి
అఅ ఆ అఆ ఆ అఅ ఆ అఆ ఆ
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలీ
అఅ ఆ అఆ ఆ అఅ ఆ అఆ ఆ
వేటాడేది ఒకటి… పరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతే అది సస్తాది
ఏ, ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే
ఎయ్, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కొరుకుద్ది పీక, హుయ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
చేపకు పురుగు ఎరా… పిట్టకు నూకలు ఎరా
కుక్కకు మాంసం ముక్క ఎరా
మనుషులందరికి బతుకే ఎరా
అఅ ఆ అఆ ఆ అఅ ఆ
గంగమ్మ తల్లి జాతర
కోళ్ళు పొటేళ్ళ కోతరా
కత్తికి నెత్తుటి పూతరా
దేవతకైనా తప్పదు ఎరా
ఇది లోకం తలరాతరా
అఅ ఆ అఆ ఆ అఅ ఆ
ఏమరుపాటుగ ఉన్నావా… ఎరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు, హా
కాలే కడుపు సూడదురో… నీతీ న్యాయం
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం
ఎయ్, దాక్కో దాక్కో మేక
పులొచ్చి కొరుకుద్ది పీక, హుయ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్
అడిగితే పుట్టదు అరువు, (అరువు)
బతిమాలితే బతుకే బరువు, (బరువు)
కొట్టరా ఉండదు కరువు, (కరువు)
దేవుడికైనా దెబ్బె గురువు
అఅ ఆ అఆ ఆ అఅ ఆ
తన్నుడు సేసే మేలు, హా… తమ్ముడు కూడా సెయ్యడు, హా
గుద్దుడు సెప్పే పాఠం… బుద్ధుడు కూడా సెప్పడహే
హమ్ హమ్ హమ్ హమ్… హమ్ హమ్ హమ్ హమ్
హమ్ హమ్ హమ్ హమ్… తగ్గేదే లే
Source link